అసైన్డ్ భూమిలో గుడిసెలు వేసేందుకు గిరిజనుల యత్నం

ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని రాళ్ళ కుంట చెరువు అసైన్డ్ భూముల్లో ఆదివారం 100 మంది గిరిజనులు గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే, ఆ భూమిని సాగు చేస్తున్న రైతు అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. పోలీసులు ఇరువర్గాల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేశారు. గుడిసెలు వేసుకునేందుకు ప్రయత్నించిన గిరిజనులు, తమకు ఇళ్లు లేవని, అసైన్డ్ భూమి, ప్రభుత్వ భూమి, హక్కు పత్రాలు ఉంటే చూపించాలని పోలీసులను కోరారు.

సంబంధిత పోస్ట్