ములుగు జిల్లా వాజేడు ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు పూసురు ముల్లేకట్ట వద్ద శనివారం ఉదయం గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఇంద్రావతి, ప్రాణహిత నదుల నుండి వచ్చిన వరద నీరు భారీగా సమ్మక్క సారలమ్మ బ్యారేజ్ కు చేరడంతో 59 గేట్లను ఎత్తి వరద నీటిని క్రిందకి వదులుతున్నారు. గోదావరి వరద మరింత పెరిగే అవకాశం ఉండడంతో అప్రమత్తమైన అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు.