ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామంలో స్మశానవాటికకు వెళ్లేందుకు సరైన రహదారి లేక గ్రామస్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో దారి బురదమయంగా మారడంతో మృతదేహాలను తరలించడం కష్టంగా మారుతోంది. అభివృద్ధి పనులపై హామీలు ఇస్తున్న నాయకులు, ప్రజాప్రతినిధులు ఈ సమస్యను పట్టించుకోవడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.