ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి అటవీ ప్రాంతంలోని తెలంగాణ నయాగరా పిలుచుకునే బొగత జలపాతం శనివారం జల కళ సంతరించుకుంది. గత రెండు రోజులుగా వాజేడు వెంకటాపురం పెనుగోలు గుట్టల ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు బోగత జలపాతంకి వర్షపు నీరు చేరింది. జలపాతం నీటిధారలు జల సవ్వడిలు కనువిందు చేస్తున్నాయి,