మేడారంలో పర్యటించిన మహిళా కమిషన్ బృందం

మేడారం జాతర సమయంలో జరిగిన లైంగిక దాడి ఆరోపణలపై జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) తీవ్రంగా స్పందించింది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఐదుగురు యువకులు బాలికపై గ్యాంగ్ రేప్ చేశారనే వార్తలు మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఎన్సీడబ్ల్యూ సుమోటోగా కేసును స్వీకరించింది. మహిళా కమిషన్ బృందం మేడారంలో పర్యటించి, ఘటన జరిగినట్లు ఆరోపణలున్న ప్రాంతాన్ని పరిశీలించి, వివరాలను సేకరించింది. ఈ ఘటనపై నివేదికను త్వరలో అందజేస్తామని కమిషన్ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్