రోడ్డు ప్రమాదంలో యువకులకు గాయాలు

శుక్రవారం రాత్రి 7 గంటలకు మంగపేట మండలంలోని కోమటిపల్లి ఫారెస్ట్ నర్సరీ ప్రాంతంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడటంతో కమలాపురంకు చెందిన లక్ష్మణ్, నరేష్ అనే ఇద్దరు యువకులు తీవ్రగాయాలపాలయ్యారు. మద్యం మత్తులో బైక్ నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది గాయపడిన యువకులను ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్