వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో సోమవారం మొత్తం 125 నామినేషన్లు దాఖలయ్యాయని ఎంపీడీవో డాక్టర్ జె. శుభ నివాస్ తెలిపారు. వీటిలో సర్పంచ్ పదవికి 51, వార్డుల పదవులకు 74 నామినేషన్లు నమోదయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు నామినేషన్ ప్రక్రియ పారదర్శకంగా, సజావుగా జరిగిందని ఆయన పేర్కొన్నారు.