వరంగల్ జిల్లా నర్సంపేటలోని సాయి శ్రీ హాస్పిటల్ లో ఖానాపురం మండలానికి చెందిన భూలక్ష్మి అనే మహిళకు కడుపునొప్పి రావడంతో డాక్టర్ రామ్ చందర్ నాయక్ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించారు. అరుదైన 7 కిలోల కణితిని శాస్త్ర చికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు. శస్త్ర చికిత్స అనంతరం భూలక్ష్మి కోలుకుంటున్నట్లు వైద్యులు సోమవారం తెలిపారు.వైద్య బృందాన్ని పలువురు అభినందించారు.