గ్రామస్తుల ఐక్యతతో ప్రాణం పోసుకున్న ప్రాథమిక పాఠశాల

ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేట నియోజకవర్గంలోని దుగ్గొండి మండలం, తిమ్మంపేట గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల గ్రామస్తుల సమిష్టి కృషితో ఆదర్శంగా నిలిచింది. 2025-26 విద్యా సంవత్సరంలో కేవలం ఒకే అడ్మిషన్ ఉన్న ఈ పాఠశాలలో ప్రస్తుతం 80 మంది విద్యార్థులు చేరారు. మూతపడే పరిస్థితిలో ఉన్న పాఠశాలకు గ్రామస్తుల ఐక్యత, పట్టుదల వల్లే పునర్జీవం లభించిందని ప్రధానోపాధ్యాయుడు వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీలత మాట్లాడుతూ, పాఠశాలకు అవసరమైన ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని కలెక్టర్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్