నర్సంపేటలో దత్తతపై అవగాహన కార్యక్రమం

వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిషత్ కార్యాలయంలో చైల్డ్ సేఫ్టీ వీక్‌లో భాగంగా గురువారం దత్తత, ఫాస్టర్ కేర్‌పై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, చట్టవిరుద్ధ దత్తతలు, బాలల అమ్మకాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఇటువంటి ఘటనలు గమనిస్తే వెంటనే చైల్డ్ హెల్ప్‌లైన్ 1098కు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు. దత్తతను చట్టబద్ధంగానే చేపట్టాలని ఆమె నొక్కి చెప్పారు.

సంబంధిత పోస్ట్