వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రైతు లడే యుగేందర్ సాగు చేసిన 17 ఎకరాల అరటి తోట శుక్రవారం రాత్రి బలమైన ఈదురు గాలులు, వర్షానికి తీవ్రంగా దెబ్బతింది. పంట కోతకు సిద్ధంగా ఉన్న సమయంలో చెట్లు నేలకూలడంతో రైతుకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లింది. పెట్టుబడి కూడా తిరిగి వస్తుందో లేదోనని ఆవేదన వ్యక్తం చేశారు.