చెన్నారావుపేటలో గురువారం విలేకరుల సమావేశంలో సీపీఎం జిల్లా కమిటీ సభ్యులు పరికి మధుకర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీల్లో సమస్యలు అధికమవుతున్నాయని, కార్యదర్శులు-ఆఫీసర్ల మధ్య సమన్వయం లేకపోవడం ప్రధాన కారణమని తెలియజేశారు. దోమల నివారణ చర్యలు లేక డెంగ్యూ, మలేరియా వ్యాప్తి చెందుతోందన్నారు. వీధిరోడ్లకు మొరం వేయాలని, సమస్యలు వెంటనే పరిష్కరించాలని హెచ్చరించారు.