చెన్నారావుపేట: అక్రమంగా నిల్వ చేసిన రేషన్ బియ్యం పట్టివేత

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండల కేంద్రంలో బుధవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన రూ. 90 వేల విలువ గల 35 క్వింటాళ్ల పీడీయస్ బియ్యం సీజ్ చేశారు. వాంకుడోత్ బాలకిషన్ నాయక్, జానుపాష అనే ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్