వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద, నర్సంపేటలోని ఖానాపూర్ మండలంలోని మనుబోతుల తండాలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాల, అంగన్‌వాడీ కేంద్రాలను జూలై 1న ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న బోధన, మధ్యాహ్న భోజనం, అంగన్‌వాడీ సేవలు, మౌలిక సదుపాయాలు, హాజరు వంటి అంశాలను పరిశీలించి, సేవల నాణ్యతను మెరుగుపరచాలని అధికారులకు, సిబ్బందికి సూచనలు చేశారు.