అవినీతి ఆరోపణలను ఖండించిన కౌన్సిలర్ అభ్యర్థి నాడెం సునీత

నర్సంపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 25వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి నాడెం సునీత శాంతి కుమార్, తాము ఎలాంటి అవినీతి చర్యలకు పాల్పడలేదని స్పష్టం చేశారు. తన ఆస్తి వివరాలు ప్రజలకు తెలుసని, అక్రమంగా ఒక్క రూపాయి కూడా సంపాదించలేదని తెలిపారు. ప్రజల సేవే లక్ష్యమని, అవకాశం ఇస్తే వార్డు అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తానని ఆమె అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థిగా తనను గెలిపించాలని ఆమె వార్డు ప్రజలను కోరారు.

సంబంధిత పోస్ట్