మేడారం జాతర లో ప్లాస్టిక్ వాడకండి పర్యావరణాన్ని రక్షించండి

ములుగు జిల్లా మేడారం జాతర అటవీ ప్రాంతంలో శనివారం పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క చేతుల మీదుగా 'ప్లాస్టిక్ ను వాడకండి. పర్యావరణాన్ని పరిరక్షించండి' అనే గోడపత్రికలను, 'జాతరకు వచ్చే భక్తులు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ను వాడకండి' అనే కరపత్రాలను ఆవిష్కరించారు. మేడారం జాతరకు వచ్చే భక్తులు అటవీ ప్రాంతంలో పర్యావరణాన్ని కాపాడుతూ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ప్లేట్స్, గ్లాస్, కవర్ల ను ఉపయోగించవద్దని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ ఆర్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్