గడువులోగా ధాన్యం కొనుగోలు పూర్తవ్వాలి: కలెక్టర్

నైరుతి రుతుపవనాల నేపథ్యంలో రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొచ్చిన ధాన్యాన్ని గడువులోగా పూర్తిగా సేకరించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. ఆదివారం ఖానాపూర్ మండలంలోని మనుబోతుల తండా, పెద్దమ్మగడ్డ తండా, ఖానాపూర్ మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా కలెక్టర్ సందర్శించి, ధాన్యం సేకరణ పురోగతి, రైతులకు కల్పిస్తున్న సౌకర్యాలు, హమాలీల అందుబాటు తదితర అంశాలపై ఆరా తీశారు.

సంబంధిత పోస్ట్