తెలంగాణలో మళ్లీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ములుగు జిల్లా వెంకటాపూర్, గోవిందరావు పేట మండలాల్లో శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. అల్పపీడన ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. భారీ వర్షంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.