మరో మహిళతో భర్త.. చనిపోయే ముందు అన్నకు వీడియో !

హైదరాబాద్ కూకట్పల్లిలో ఇద్దరు చిన్నారులను చంపి తల్లి స్రవంతి ఆత్మహత్య చేసుకున్న ఘటనలో కీలక మలుపు చోటుచేసుకుంది. చనిపోవడానికి ముందు ఆమె వరంగల్‌ జిల్లా ఎల్లయ్యగూడెం పంచాయతీలోని పదహారు చింతల తాండాకు చెందిన తన అన్నకు వీడియో సందేశం పంపినట్టు వెలుగులోకి వచ్చింది. అందులో భర్త ప్రవీణ్ మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని, తనను చంపేందుకు హైదరాబాద్ కు తీసుకువచ్చి తీవ్రంగా వేధిస్తున్నాడని వాపోయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారి సంచలనం రేపుతోంది. ఈ ఘటనలో భర్త ప్రవీణ్ పై అనుమానాలు బలపడుతున్నాయి.

సంబంధిత పోస్ట్