బాల్య వివాహ రహిత గ్రామంగా ఖానాపూర్: ప్రత్యేక గ్రామసభలో తీర్మానం

ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేటలోని ఖానాపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో శుక్రవారం వికసిత గ్రామపంచాయతీ ప్రణాళిక ప్రత్యేక గ్రామసభ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో, మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు షేర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ దాసరి రమేష్, ఎంపీడీవో అద్వైత, షేర్ ఎన్జీవో ప్రతినిధి జన్ను ప్రభాకర్, ఉప సర్పంచ్ రంజిత్ కుమార్, పంచాయతీ సెక్రెటరీ, వార్డు సభ్యులు, అంగన్వాడి టీచర్లు, మహిళా సంఘం నాయకులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕