ఖానాపురం: చిరుతపులి కనిపిస్తే సమాచారం ఇవ్వండి

వరంగల్ జిల్లా ఖానాపురం మండలంలోని ఖానాపురం - రాగంపేట గ్రామాల శివారులో చిరుతపులి ఆనవాళ్ల కోసం అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆదివారం రాగంపేట శివారులో కనిపించిన చిరుత సోమవారం కూడా అదే ప్రాంతంలో సంచరించినట్లు కొందరు వ్యక్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. ఆయిల్ పాం తోటలు, పంటచేలలో కాలిముద్రలు, ఇతర ఆనవాళ్ల కోసం గాలింపు చేపట్టినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చిరుత కనిపిస్తే అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్