వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఆదివారం వడ్డెర ఓబన్న 139వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్ కోదండరాం ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వరంగల్ జిల్లా ఓబీసీ చైర్మన్ ఓర్సు తిరుపతి మాట్లాడుతూ, వడ్డరి కులస్తులు వెనుకబడ్డారని పేర్కొంటూ వారిని ఎసి ఎసిసి జాబితాలో చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో వడ్డరి సంఘ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.