నల్లబెల్లిలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

నల్లబెల్లి మండల కేంద్రంలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతి వేడుకలను ఆదివారం పద్మశాలి కుల బంధువుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ నాగెల్లి జ్యోతి – ప్రకాష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమం, సామాజిక సేవా రంగాల్లో బాపూజీ చేసిన సేవలను పలువురు స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తూ సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి కుల బంధువులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్

✕
✕