వరంగల్ జిల్లాలోని చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండాలో ప్రేమోన్మాది దాడిలో గాయపడిన గిరిజన కుటుంబానికి మంగళవారం మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. పార్టీ తరఫున 5 లక్షలతో పాటు పిల్లలిద్దరీ చదువు బాధ్యత తనదేనని తెలిపారు. బాధిత కుటుంబానికి మానవతా ధృక్పథంతోప్రభుత్వం 50 లక్షలు అందిచాలని విజ్ఞప్తి చేశారు. బాధితులను మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, పెద్ది స్వప్న కేటీఆర్ వద్దకు తీసుకెళ్లారు.