వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆత్మహత్య చేసుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ కుటుంబాన్ని మంగళవారం కేటీఆర్ పరామర్శించి, పార్టీ తరఫున రూ. 5 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఆర్టీసీ విలీనం, పీఆర్సీ అమలులో ఆలస్యంపై ఆయన ప్రభుత్వానికి విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని, కార్మికులకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు.