నర్సంపేట అయ్యప్ప ఆలయానికి వెంకటేశ్వర స్వామి ప్రతిమ బహూకరణ

నర్సంపేట అయ్యప్ప స్వామి ఆలయ ధర్మకర్తల మండలి సభ్యులు హైదరాబాద్‌లో నివాసముంటున్న ఆధ్యాత్మిక వేత్త, ముత్తోజిపేటకు చెందిన శ్రీ పడిదల నవీన్ కుమార్ ను వారి స్వగృహంలో కలిసి, ఈ నెల 9న ఆలయంలో నిర్వహించనున్న ఉత్తర ఫల్గుణి నక్షత్ర పడిపూజకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా నవీన్ రావు భక్తిశ్రద్ధలతో శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రతిమను ఆలయానికి బహూకరించారు. ఆయన ఆధ్యాత్మిక సేవకు ధర్మకర్తల మండలి సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్

✕
✕