ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎంసిపిఐ(యూ) శ్రేణుల ఆందోళన

మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల వల్ల నిరుద్యోగం, నిత్యావసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం నర్సంపేట ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎంసిపిఐ(యు) శ్రేణులు నిరసన చేపట్టి ఆర్డీవో ఉమారాణికి మెమొరాండం అందజేశారు. మోడీ అధికారంలోకి వచ్చాక మూడుసార్లు నిత్యావసర వస్తువుల ధరలు పెంచారని ఆరోపించారు.

సంబంధిత పోస్ట్