బహిరంగ సభ ప్రాంగణాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే, సిపి

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో డిసెంబర్ 5న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో, మంగళవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, సిపి సన్ ప్రీత్ సింగ్ హెలిప్యాడ్, సభ స్థలాన్ని పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిసిపి, ఏసిపి రవీందర్ రెడ్డి, సిఐలు, ఎస్సైలు, టిపిసిసి సభ్యులు పెండెం రామానంద్, మార్కెట్ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్