వరంగల్ నల్లబెల్లి మండలం రంగాయ చెరువు కాలువ పనులను వెంటనే పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు సోమవారం రుద్రగూడెం శివారు జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ ఆందోళనతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. అధికారులు స్పందించి పనులు పూర్తి చేయాలని, లేనిపక్షంలో పోరాటం ఉధృతం చేస్తామని సుదర్శన్ రెడ్డి హెచ్చరించారు.