వరంగల్ జిల్లా నల్లబెల్లి మండల కేంద్రంలో శనివారం రైతులు యూరియా కోసం పడిగాపులు కాశారు. పంటలకు అవసరమైన ఎరువుల కోసం ప్రాథమిక వ్యవసాయ కేంద్రం వద్ద పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ముఖ్యంగా యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది రైతులు కొన్ని రోజులుగా సరఫరా కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఎరువులు అందక నిరాశ చెందుతున్నారు. ఆరు మెట్రిక్ టన్నుల యూరియా ఉందని, అందరికీ వస్తుందని వ్యవసాయాధికారి చెప్పారు.