వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ముగిసింది. మంగళవారం కొందరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. మొత్తం 30 వార్డులకు గాను 120 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీ. ఆర్. ఎస్, బీజేపీ నుంచి ఒక్కో పార్టీ నుంచి 30 మంది చొప్పున పోటీ పడుతున్నారు. జనసేన నుంచి ఇద్దరు, ఎంసీపీఐ(యూ) నుంచి ఆరుగురు, 17 మంది స్వతంత్రులు, మరో నలుగురు ఇతర పార్టీల నుంచి అభ్యర్థులు బరిలో ఉన్నారు.