వరంగల్ జిల్లా నర్సంపేట మండల పరిధిలోని బోజ్యానాయక్ తండాలో గురువారం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను జిల్లా కలెక్టర్ సత్య శారద పునః ప్రారంభించారు. పాఠశాలను తిరిగి ప్రారంభించడం సంతోషంగా ఉందని గ్రామ ప్రజలు అంటున్నారు. గత 15 సంవత్సరాలుగా మూతపడిన ప్రభుత్య పాఠశాలను బోజ్యానాయక్ తండా యువత ఒక కమిటీగా ఏర్పడి పాఠశాల పునః ప్రారంభానికి కృషి చేశారు.