నర్సంపేట: అక్రమ అరెస్టులను ఖండించండి

మహాలక్ష్మి పథకంతో రోడ్డున పడ్డ ఆటో కార్మికులను ఆదుకోవాలని, ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన విధంగా ప్రతి ఆటో డ్రైవర్‌కు నెలకు జీవన భృతి కింద ఆర్థిక సహాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆటో జేఏసీ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో శాంతియుతంగా అసెంబ్లీ ముట్టడికి వెళ్తున్న కార్మికులను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. కందికొండ శ్రీనివాస్, పెండం వెంకటేశ్వర్లు, గణేష్, నరసయ్య వంటి నాయకులను అరెస్టు చేయడం సరికాదని ఆటో కార్మికులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్