నర్సంపేట: కాంగ్రెస్ అభ్యర్థి రజిని భారతి ప్రచారం జోరు

నర్సంపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారం వేడెక్కుతున్న నేపథ్యంలో, 28వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిలువేరు రజిని భారతి తన ప్రచారాన్ని ఉత్సాహంగా కొనసాగిస్తున్నారు. వార్డు ప్రజలకు ఎలాంటి సమస్య వచ్చినా తాను అందుబాటులో ఉంటానని, ఫోన్ చేస్తే వెంటనే స్పందించి పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. తనను గెలిపిస్తే 28వ వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్తానని, ప్రజల విశ్వాసానికి తగిన విధంగా సేవ చేస్తానని తెలిపారు. ప్రజల మద్దతుతో మంచి మార్పు తీసుకురావాలని కోరుతూ ఓటు వేయాలని ఓటర్లను ఆమె విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్