ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ మల్లం నవీన్ ఆధ్వర్యంలో అధ్యాపకులు 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్ల కోసం ముందస్తు ప్రచారం చేపట్టారు. నర్సంపేట, పరిసర జూనియర్ కళాశాలల్లో పర్యటిస్తూ, కళాశాల విశిష్టతలను వివరించారు. 18 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న కళాశాలలో విశాలమైన తరగతి గదులు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్‌లు ఉన్నాయని, విద్యార్థుల సామర్థ్యాన్ని పెంచేందుకు టాస్క్, కెరీర్ గైడెన్స్, కాంపిటీటివ్ ఎగ్జామ్స్ సెల్స్ ద్వారా శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.