వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరంలో అప్పు ఇచ్చి మోసం చేశారని మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న వీరస్వామి ఘటనపై అతడి కుటుంబ సభ్యులు బుధవారం తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన తండ్రి ఆత్మహత్యకు కారణమైన నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విచారణను వేగవంతం చేయాలని పోలీసులను కోరారు. దహన సంస్కారాలకు కూడా డబ్బులు లేవని బాధిత కుటుంబ సభ్యులు వాపోయారు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు.