వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఛత్రపతి శివాజీ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. శనివారం ఉత్సవాల్లో ఆరో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. సాయంత్రం కాశీ పండితులచే మహా హారతి నిర్వహించగా, వేలాది మంది భక్తులు హాజరై అమ్మవారి ఆశీస్సులు పొందారు. పట్టణంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.