వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని సర్వాపురం వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తాపీ మేస్త్రి యాకయ్య (40) మృతి చెందాడు. కూలీ పని ముగించుకుని వస్తుండగా, రోడ్డు దాటుతున్న సమయంలో ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించాడు. మృతుడికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.