నర్సంపేట: వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి

వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని మాదన్నపేట రోడ్డులో గురువారం వ్యభిచార గృహంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు.
వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళతో పాటు ముగ్గురు విటులను అరెస్టు చేసారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వ్యభిచార గృహంలో భారీగా కండోమ్ ప్యాకెట్లు, హేచ్ఐవీ కిట్లు లభ్యమయ్యాయి. వ్యభిచారం నిర్వహిస్తున్న మహిళ కిన్నెరపు ఉమాతో పాటు కొయ్యల రమేష్, కొయ్యల నితిన్, కేసనపల్లి విక్రమ్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత పోస్ట్