హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ లో ప్రాణాపాయ స్థితిలో అపస్మారక స్థితిలో కొట్టుమిట్టాడుతున్న వరంగల్ జిల్లా నర్సంపేట మండలం గురిజాల గ్రామానికి చెందిన చిన్నపెల్లి అజయ్ (23)కి మెరుగైన వైద్య చికిత్స కోసం గ్రామస్థులు ఆర్ధిక సహాయం అందించారు. గురిజాల గ్రామానికి చెందిన ఆర్టీసీ ఉద్యోగి గొలనకొండ వేణు 138 మంది నుండి వాట్సప్ గ్రూప్ ల ద్వారా విరాళాలు సేకరించి రూ. 1 లక్ష 11 వేల 755 వీరబోయిన కృష్ణ, ఆముదాల సతీష్, ఎండీ. అక్బర్, బత్తిని ప్రశాంత్ తదితరులతో వేణు కలిసి శుక్రవారం నగదు మొత్తాన్ని అందజేశారు.