నర్సంపేట మండలం గుంటూరుపల్లె గ్రామ పంచాయితీ భిమ్లా నాయక్ తండా నుండి వివిధ పార్టీలకు చెందిన యువ నాయకులు మంగళవారం బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీలో చేరారు. తండా కు చెందిన లావుడ్య శివ, లావుడ్య శంకర్, గుగులోతు సుమన్, బానోతు ప్రీతం, బానోత్ దేవేందర్, మాలోత్ రాజు, బానోత్ సురేష్, గుగులోతు దేవేందర్, తదితరులు కండువా కప్పుకొని పార్టీలో చేరారు.