నర్సంపేట: అబ్బ ఇంత అందంగా ఎలా పుట్టానో!

వరంగల్ జిల్లా నర్సంపేట మండలం ముత్తోజిపేటలో గురువారం ఓ వానరం అద్దంలో పదేపదే తన ముఖం చూసుకుంటూ మైమరచిపోయింది. అద్దంలో కోతి తన ప్రతిబింబాన్ని చూస్తూ షాక్కు గురవుతూ, మరొకసారి ఇంకో కోతి తన ఎదురుగానే ఉందనుకొని కంగారు పడటం కనిపించింది. సుమారు 10 నిమిషాలు అద్దంలో తన అందాన్ని తాను చూసి మురిసిపోయిన కోతి కొద్దిసేపటికి అద్దాన్ని వదిలేసి వెళ్లిపోయింది.

సంబంధిత పోస్ట్