వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ జిల్లా హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు గత ఆరు నెలల నుండి రావలసిన పెండింగ్ వేతనాలను వెంటనే విడుదల చేయాలని బి.ఆర్.టి.యు. జిల్లా అధ్యక్షుడు గోనే యువరాజు డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ కార్మికులను కలిసి వారి సమస్యలను అధ్యయనం చేశారు. జిల్లా ఆసుపత్రి, మెడికల్ కాలేజ్, ప్రసూతి హాస్పిటల్లో శానిటేషన్, పేషంట్ కేర్, సెక్యూరిటీ, సూపర్వైజర్స్ విభాగాలలో సుమారు 40 మంది కార్మికులు కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారని, వారికి జీతాలు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు.