దాత, ప్రముఖ పారిశ్రామికవేత్త దొడ్డ మోహన్ రావు గుండెపోటుతో శనివారం రాత్రి హైదరాబాద్ లోని తన నివాసంలో మృతి చెందారు. అంత్యక్రియల కార్యక్రమం ఆదివారం మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్ ఫిల్మ్ నగర్ మహా ప్రస్థానం లో జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన స్వగ్రామం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగగిరి. ఎన్నో సేవా కార్యక్రమాలు, గుళ్లు, కరోనా బాధిత కుటుంబాలకు కోట్ల రూపాయలు దానం చేశారు.