ఉమ్మడి వరంగల్ జిల్లా, నర్సంపేటలోని కోనాపురం గ్రామంలో ఆదివారం విజయవంతంగా పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. గ్రామ సర్పంచ్ మైదం రాకేష్ ముఖ్య అతిథిగా హాజరై, 0-5 ఏళ్ల పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వైద్యారోగ్య శాఖ సిబ్బంది, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు ప్రత్యేక బూత్‌లు ఏర్పాటు చేసి పిల్లలందరికీ చుక్కలు వేయించారు.