నర్సంపేటలో పాపయ్యపేట గ్రామానికి చెందిన రాములు అనే వ్యక్తికి కుడి పాదంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ సోకింది. నిక్రోటైజింగ్ పాసియైటిస్ కారణంగా దెబ్బతిన్న చర్మాన్ని తొలగించి, కొత్త చర్మాన్ని గ్రాఫ్టింగ్ చేసే అరుదైన శస్త్రచికిత్సను నర్సంపేటలోని ఐకాన్ ఆసుపత్రిలో డాక్టర్ బి. రాజు ఆధునిక పద్ధతిలో విజయవంతంగా నిర్వహించారు. ప్రస్తుతం రాములు కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. ఈ అరుదైన చికిత్సను విజయవంతంగా నిర్వహించినందుకు వైద్య బృందాన్ని అభినందించారు.