నల్లబెల్లి మండలం లెంకాలపల్లి సర్పంచ్ కస్తూరి విజయలక్ష్మి, ఆమె భర్త కస్తూరి రవీందర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ నెల 16న ఇటుకాలపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో విజయలక్ష్మి తీవ్రంగా గాయపడి 17న మృతి చెందారు. తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె భర్త రవీందర్ మంగళవారం ఉదయం మృతి చెందారు. ఒకే ప్రమాదంలో భార్యాభర్తలు మృతి చెందడంతో కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్థులు కన్నీరుమున్నీరయ్యారు.