చెక్కలపల్లి గ్రామంలో క్రీడా ప్రాంగణం సిద్ధం

నల్లబెల్లి మండలం మూడు చెక్కలపల్లి గ్రామంలో క్రీడాకారులకు అనుకూలంగా క్రీడా ప్రాంగణాన్ని చదును చేసే పనులు పూర్తయ్యాయి. గ్రామ సర్పంచ్ సపావట్ కవిత దేవు నాయక్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో, గ్రామ యువతను ప్రోత్సహించే ఉద్దేశంతో క్రీడాకారులకు రూ.2,400 విలువైన క్రికెట్ బ్యాట్‌ను బహుమతిగా అందజేశారు. క్రీడలకు ప్రాధాన్యత ఇస్తూ మౌలిక వసతులు కల్పించడంపై గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్