ఏకలవ్య పాఠశాలలో మొక్కలు నాటిన విద్యార్థులు, ఉపాధ్యాయులు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా పోగుళ్ళపల్లి ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్‌లో సోమవారం వృక్షోపన కార్యక్రమం జరిగింది. ప్రిన్సిపల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని మొక్కలు నాటారు. ప్రతి విద్యార్థి పుట్టినరోజున ఒక మొక్క నాటాలని కౌన్సిలర్ మహేష్ పిలుపునిచ్చారు. మొక్కలు పర్యావరణ సమతుల్యతను పెంచుతాయని, విద్యార్థులు పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్