నల్లబెల్లి మండలంలో ప్రాణం తీసిన ఈత సరదా

వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో విషాదం చోటుచేసుకుంది. కన్నరావుపేటకు చెందిన రోహిత్ (11) అనే బాలుడు నలుగురు స్నేహితులతో కలిసి చెరువు వద్దకు వెళ్ళాడు. ఈతకు దిగినప్పుడు చెరువు లోతును అంచనా వేయలేక నీటిలో మునిగిపోయాడు. స్థానికులు గాలింపు చర్యలు చేపట్టి బాలుడిని బయటకు తీయగా అప్పటికే మృతి చెందాడు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర దుఃఖంలో మునిగిపోగా, గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్